15.60లక్షలు పలికిన బాలాపూర్‌ గణేశుడి లడ్డూ

Highlights

భాగ్యనగరంలో వినాయకుడి లడ్డు వేలంపాట అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా బాలాపూర్ గణేశుడి లడ్డూ లక్షలు పలుకుతూ తెలుగు...

భాగ్యనగరంలో వినాయకుడి లడ్డు వేలంపాట అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా బాలాపూర్ గణేశుడి లడ్డూ లక్షలు పలుకుతూ తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణేషుడి లడ్డూ వేలం పాటలు ఒకఎత్తయితే, బాలాపూర్ లడ్డు వేలం పాట మరోఎత్తు. లక్షలు చెల్లించి లడ్డూలను సొంతం చేసుకునేందుకు భక్తలు పోటీలు పడి దక్కించుకుంటారు. ఈ సారి ఈ వేలంలో 21మంది పాల్గొన్నారు. ఈ సారి రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పలికింది. రూ.15.60 లక్షలకు జూబ్లీహిల్స్ లోని అయ్యప్ప సొసైటీకి చెందిన నాగం తిరుపతిరెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకున్న ఈ గణనాథుడు లడ్డూ వేలంలో ఏటా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాడు. గత 23 ఏళ్లుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ లడ్డూ గతేడాది వేలంలో రూ.14.65లక్షలకు స్థానికేతరుడు స్కైల్యాబ్‌రెడ్డి దక్కించుకోగా.. ఈ ఏడాది రూ.95వేలు ఎక్కువ ధర పలికింది.

Show Full Article
Print Article
Next Story
More Stories