దాసరి కోడలిపై దాడి

Submitted by arun on Thu, 09/13/2018 - 10:22
dasari

ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కోడలు దాసరి పద్మ జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మొదటి భార్య ఇంట్లోకి చొరబడి తనపై దాడిచేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నం.46లోని ఇంట్లో తాను, తన భర్త దాసరి తారకహరిహర ప్రభుతో ఉంటున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న రాత్రి 7 గంటలకు తన భర్త మాజీ భార్య సుశీల, మరో మహిళ సంధ్యను వెంటపెట్టుకుని అక్రమంగా తమ ఇంట్లోకి ప్రవేశించిందన్నారు. ఆ రాత్రి సుశీల, సంధ్య ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని, ఈ నెల 11న తెల్లవారుజామున కిచెన్‌లోకి వెళ్తున్న తనపై సుశీల, సంధ్య కర్రతో దాడి చేసినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దాసరి సుశీలపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, తారక హరిహర ప్రభు ఆస్తిలో తనకూ వాటా ఉందని సుశీల వాదిస్తున్నారు.

English Title
attack on dasari narayana rao daughter law

MORE FROM AUTHOR

RELATED ARTICLES