వాజ్ పేయి చితాభస్మాన్ని సేకరించిన దత్త కూతురు

వాజ్ పేయి చితాభస్మాన్ని సేకరించిన దత్త కూతురు
x
Highlights

దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు జరిగిన యమునా తీరంలోని స్మృతి స్థల్ నుంచి ఆయన చితాభస్మాన్ని దత్త కుమార్తె నమిత, ఆమె కూతురు నిహారిక...

దివంగత బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు జరిగిన యమునా తీరంలోని స్మృతి స్థల్ నుంచి ఆయన చితాభస్మాన్ని దత్త కుమార్తె నమిత, ఆమె కూతురు నిహారిక ఈ ఉదయం సేకరించారు. అంత్యక్రియలు జరిగిన మూడో రోజున సంచయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతం నుంచి చితాభస్మాన్ని సేకరించి మూడు కుండల్లో ఉంచారు. వీటిని ప్రేమ్ ఆశ్రమ్ కు తరలిస్తామని, ఆ తరువాత ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామని వాజ్ పేయి బంధువులు తెలిపారు. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నదుల్లో వాజ్‌పేయి అస్థికలను నిమజ్జనం చేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ వెల్లడించారు. కాగా వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories