మగ ప్రొఫెసర్లకు వద్దకు వెళ్తే మార్కులు: లేడీ ప్రొఫెసర్‌

Submitted by arun on Tue, 04/17/2018 - 16:05
asst professor

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన మహిళా ప్రొఫెసర్ విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించడం...ఆ విద్యార్థులు తమ ఆవేదనలో మొదట్లో తమలోనే దాచుకున్నప్పటికీ..అనంతరం శృతిమించడంతో ఇతరులకు పంచుకోవడం..దీనిపై ఉద్యమించిన ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులో మ్యాథ్స్ బోదించే మహిళా ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. కాలేజీలో నలుగురు అమ్మాయిల్ని శృంగారంలోకి దించేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విరుద్దానగర్ జిల్లాలోని దేవాంగ ఆర్ట్స్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.

విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట్టైలోని దేవాంగర్‌ ఆర్ట్స్‌ కళాశాలలో మూడువేల మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. ఈ కళాశాలలో అదే ప్రాంతానికి చెందిన నిర్మలాదేవి 15 ఏళ్లుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మదురై యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులకు ‘సన్నిహితంగా’ మెలగాల్సిందిగా నలుగురు విద్యార్థినులపై ఈనెల 13వ తేదీన సెల్‌ఫోన్‌ ద్వారా ఆమె ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ‘ఇప్పటివరకూ మనమధ్య ప్రొఫెసర్, విద్యార్థినుల సంబంధాలు, ఇక తరువాత లెవల్‌కు పోదాం, నలుగురూ ఒక్కచోటనే ఉన్నారు కదా, నాకు తెలుసు, నేను చెప్పినట్లు నడుచుకుంటే వర్సిటీ అధికారులతో చెప్పి మంచి మార్కులు వేయిస్తాను, ఆర్థికంగా కూడా మీకు లాభం ఉంటుంది, కళాశాలకు క్రమం తప్పకుండా రాకున్నా అటెండెన్స్‌ వచ్చేలా చేస్తాను’ అని ఆమె విద్యార్థినులతో అన్నారు. ‘వద్దు మేడం.. మా కలాంటివి వద్దు’ అని విద్యార్థినులు నిరాకరించినా, ‘తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, ఒకటిన్నర నెలలో ప్రాక్టికల్స్‌ వస్తాయి, అందుకే ఈరోజు ఫోన్‌చేశాను, రెండు రోజుల్లో ఆలోచించుకుని చెప్పండి, మనం మాట్లాడుకున్న విషయాలు గోప్యంగా ఉంచండి..’ అంటూ మరీ ఒత్తిడిచేసినట్లు సమాచారం.

విద్యార్థినులు, నిర్మలాదేవి మధ్య సాగిన సంభాషణలు ఆదివారం వాట్సాప్‌లో వైరలయ్యాయి. ఈ క్రమంలో పలువురు సంఘ సేవకులు, మహిళా సంఘాలు నిర్మలాదేవిపై నిప్పులుగక్కాయి. అలాగే బాధిత విద్యార్థినులు కళాశాల కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో నిర్మలాదేవిని సోమవారంఉదయం సస్పెండ్‌ చేశారు. ఈ చర్చలకు సంబంధించిన ఆడియో వాట్సాప్లో వైరల్ అవడంతో ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ విచారణకు ఆదేశించారు. విద్యార్థినులతో మాట్లాడింది నిజమేనని వాట్సాప్లో వైరలైనది తన గొంతుకనే అని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి అంగీకరించారు. అయితే తన మాటల్లో దురుద్దేశం లేదని కొన్ని మాటలను కత్తిరించి తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేశారని ఆమె ఆరోపించారు. తమ వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మధురై కామరాజ్ వర్సిటీ వీసీ ఆరోపించారు.  విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహించడం క్షమించరాని నేరమని ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ తెలిపారు.

English Title
asst professor nirmala devi arrest harassments case

MORE FROM AUTHOR

RELATED ARTICLES