హలో నేను నయనతారని మాట్లాడుతున్నాను

హలో నేను నయనతారని మాట్లాడుతున్నాను
x
Highlights

తిమ్మిని బమ్మిని చేసే దొంగల్ని ఆటకట్టేలా పోలీసులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. మరి అలాంటి పోలీసులు ఓ దొంగను పట్టుకోవడానికి నయనతార ఫోటోని అస్త్రంగా...

తిమ్మిని బమ్మిని చేసే దొంగల్ని ఆటకట్టేలా పోలీసులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. మరి అలాంటి పోలీసులు ఓ దొంగను పట్టుకోవడానికి నయనతార ఫోటోని అస్త్రంగా ఉపయోగించుకున్నారు.

బిహార్‌లోని దర్భంగాలో బీజేపీ నేత సంజయ్ కుమార్ తన ఖరీదైన సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. దీంతో దర్భంగా పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా సంజయ్ ముబైల్ గ్యాంగ్‌స్టర్ హస్‌నైన్ వద్ద ఉన్నట్టు తెలుసుకున్నారు. అయితే ఈ కేసును టేకప్ చేస్తున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అయిన మధుబాల దేవి హస్ నైన్ అరెస్ట్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది. దొరికినట్టే దొరికి తప్పించుకునేవాడు. అలా పలుమార్లు గ్యాంగ్ స్టర్ తప్పించుకోవడంతో ఎలాగైనా ఈ సారి అతడి ఆటకట్టించాలని మధుబాల దేవి గ్యాంగ్‌స్టర్ గాళ్ ఫ్రెండ్‌ అవతారం ఎత్తారు.

పలుమార్లు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడారు. ఎన్నిసార్లు మాట్లాడిన పట్టించుకోని హస్ నైన్ చివరికి ట్రాప్ లో పడ్డాడు. మధుబాల మరోసారి ఫోన్ చేసినప్పుడు ఫొటో పంపాల్సిందిగా కోరాడు. వెంటనే అప్రమత్తమైన మధుబాల తన మొబైల్‌లోని ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చేసి, ఆ స్థానంలో నయనతార ఫొటోను పెట్టారు. అనంతరం దానిని గ్యాంగ్‌స్టర్‌కు పంపారు.

ఆ ఫొటో చూడగానే హస్‌నైన్‌‌కు పిచ్చెక్కిపోయింది. కలుద్దామంటూ ప్రపోజ్ చేశాడు. దర్భంగా‌లో కలుద్దామంటూ ఓ చోటు చెప్పి అక్కడికి రమ్మన్నాడు. అనుకున్నట్టే బురఖా ధరించి అక్కడికి వెళ్లిన మధుబాల మఫ్టీలో ఉన్న ఇతర పోలీసుల సాయంతో గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకున్నారు.
అనంతరం పోలీసులు తనదైనశైలిలో విచారించగా తాను మరోదొంగ వద్ద 4000 ఫోన్ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. మరో నిందితుడు కోసం గాలింపుచర్యులు ప్రారంభించారు.

ఇదిలా ఉంటే వినూత్న ఆలోచనతో గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకున్న దేవిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉన్నతాధికారులు ఆమెకు రివార్డు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories