24 వేల కోట్లు ఇవ్వాలని అడిగితే... 24 రూపాయలు కూడా ఇవ్వలేదు

24 వేల కోట్లు ఇవ్వాలని అడిగితే... 24 రూపాయలు కూడా ఇవ్వలేదు
x
Highlights

తెలంగాణను అప్పుల రాష్ట్రం అనొద్దన్నారు ముఖ‌్యమంత్రి కేసీఆర్‌‌. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొంతమేర అప్పులు చేయక తప్పదన్నారు. అమెరికా, జపాన్ అప్పుల్లో...

తెలంగాణను అప్పుల రాష్ట్రం అనొద్దన్నారు ముఖ‌్యమంత్రి కేసీఆర్‌‌. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొంతమేర అప్పులు చేయక తప్పదన్నారు. అమెరికా, జపాన్ అప్పుల్లో ఉన్నా ప్రపంచాన్నే శాసిస్తున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని అర్హతులున్నా రాష్ట్ర జీడీపీలో 21శాతం మాత్రమే అప్పులు ఉన్నాయన్న కేసీఆర్ ఇది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నారు.

తెలంగాణ బడ్జెట్ పై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌‌రావు ఆరోపించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా స్పందించారు. రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేస్తే తప్పేంటన్నారు. ఏం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పులు చేయడం లేదా అంటూ ప్రశ్నించారు. కేంద్ర జీడీపీలో 49.5 శాతం అంటే 82లక్షల కోట్లు అప్పు ఉందని, ఇందులో మోడీ సర్కారే 25 లక్షల కోట్లు అప్పు చేసిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని అర్హతులున్నా రాష్ట్ర జీడీపీలో 21శాతం మాత్రమే అప్పులు ఉన్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వంపైనా కేసీఆర్‌‌ విరుచుకుపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు 24వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్‌ సిఫారసు చేస్తే, కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
2017-18 బడ్జెట్‌లో 90శాతానికి పైగా నిధులు ఖర్చు చేశామన్న ఆర్ధికమంత్రి ఈటెల ఎవరూ అడగకపోయినా వివిధ వర్గాలకు నిధులు పెంచామన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌ వివరణ ఇచ్చారు. ఇక ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ చురకలంటించారు. సభలో చిట్‌చాట్‌ చేయొద్దని మండిపడ్డారు. సబ్జెక్ట్‌ అర్ధంకానప్పుడు ప్రశ్నలు వేయొద్దని మందలించారు. అలాగే సభ్యులు తెలుగులోనే మాట్లాడాలంటూ క్లాస్‌ తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories