అసోం 3.29 కోట్ల జనాభాలో 1.9 కోట్ల మంది మాత్రమే భారతీయులు

Submitted by arun on Tue, 01/02/2018 - 13:29
assam

మ‌న‌దేశంలో జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి)క‌లిగిన ఏకైక రాష్ట్రం అస్సాం. ఇత‌ర దేశాల నుంచి అస్సాంకు వ‌ల‌స‌లు పెరిగిపోయాయి. దీంతో భార‌తీయులు ఎవ‌రు, విదేశీయులు ఎవ‌రు అనే విష‌యాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న సుప్రీం కోర్ట్  ఎన్ ఆర్ సి అనే జీవోను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ జీవో లో అస్సాంలో ఉన్న స్వ‌దేశీయులు, విదేశీయులు సైతం తాము చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన భార‌త జాతీయుల‌మంటూ త‌మ పేర్ల‌ను జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి) న‌మోదు చేసుకోవాలి. అలా న‌మోదు చేసుకున్న పేర్ల‌ను సుప్రీం కోర్టు ప‌ర్య‌వేక్షించి వారిని భార‌తీయులుగా గుర్తిస్తారు.  ని ప్ర‌వేశ పెట్టింది. త‌ద్వారా అస్సాంలో ఉన్న విదేశీయులు ఈ జీవో ఆధారంగా భార‌తీయులుగా గుర్తింపు తెచ్చుకోవ‌చ్చు.  

ఇదిలా ఉంటే ఈ జాబితాలో త‌మ‌పేర్ల‌ను న‌మోదు చేసుకున్న అసోంలోని మొత్తం 3.29 కోట్ల మంది జనాభాలో కేవలం 1.9 కోట్ల మంది మాత్రమే భారత జాతీయులని  జాబితా వెల్లడించింది. వీరిలో అసోం నుండి భారతీయ పౌరసత్వం కోసం 3.29 కోట్ల మంది దరఖాస్తులు చేసుకున్నారని, వీరిలో 1.9 కోట్ల మందిని భారతీయులుగా నిర్ధారించామని భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ శైలేష్‌ మీడియాకు చెప్పారు. వీరి దరఖాస్తులు వివిధ దశల్లో పరిశీలనలో వున్నాయని ఆయన వివరించారు. మిగిలిన దరఖాస్తు దారుల పేర్లు వివిధ దశల్లో పరిశీలనలో వున్నాయని, పరిశీలన ముగిసిన అనంతరం మరో ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి ముసాయిదా ఎప్పుడు విడుదల చేస్తారన్న ప్రశ్నకు రిజిస్ట్రార్‌ జనరల్‌ బదులిస్తూ అది సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఏప్రిల్‌లో జరిగే తదుపరి విచారణలో నిర్ణయిస్తామన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఈ జాబితా రూపకల్పన జరిగిందని ఆయన చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ 2018లోనే పూర్తవుతుందన్నారు. దరఖాస్తు ప్రక్రియను 2015 మేలో ప్రారం బించగా, అసోం రాష్ట్రంలోని మొత్తం 68.27 లక్షల కుటుం బాల నుండి 6.5 కోట్ల దర ఖాస్తులు అందాయని ఆయన వివరించారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధిం చిన కసరత్తును 2013 డిసెంబర్‌లో ప్రారంభిం చామని, దీనికి సంబంధించి  సుప్రీంకోర్టు  త‌న మార్గ‌ద‌ర్శ‌కాల్ని విడుద‌ల చేస్తుంద‌ని సూచించారు. 
 

English Title
Assam publishes part draft of NRC, 1.9 crore names in list

MORE FROM AUTHOR

RELATED ARTICLES