ఏనుగెక్కి కింద పడిన డిప్యూటీ స్పీకర్

Submitted by arun on Tue, 10/09/2018 - 13:14
assam deputy speaker

అస్సాం డిప్యూటీ స్పీకర్‌ కృపానాథ్‌ మల్లా ఏనుగు అంబారీపైనుంచి జారి పడిపోయారు. అస్సాం డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం మల్లా తన నియోజక వర్గమైన రాటాబారికి వచ్చారు. ఏనుగు అంబారీపై ఊరేగుతూ తన నియోజక వర్గంలో కార్యకర్తలను కలవడానికి వచ్చారు. అయితే ఏనుగు ఒక్కసారిగా పరుగు తీయడంతో మల్లా పట్టు తప్పి జారిపడిపోయారు. కాగా మల్లా ఏమీ కంగారుపడకుండా లేచి నిలబడి మొత్తం సంఘటనను తలచుకుని నవ్వేశారు.
 

English Title
Assam Deputy Speaker Falls During Elephant Ride, Laughs It Off

MORE FROM AUTHOR

RELATED ARTICLES