ఆసియా చాంపియన్స్ భారత్, పాక్

ఆసియా చాంపియన్స్ భారత్, పాక్
x
Highlights

2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను...డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ జట్లు కలసి సంయుక్తంగా గెలుచుకొన్నాయి. మస్కట్ లోని...

2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను...డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ జట్లు కలసి సంయుక్తంగా గెలుచుకొన్నాయి. మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా గత వారం రోజులుగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్స్ కు భారత్, పాకిస్థాన్ జట్లు అర్హత సంపాదించాయి. అయితే...కుండపోత వర్షం కారణంగా టైటిల్ సమరం రద్దు కావడంతో...రెండుజట్లను సంయుక్త విజిేతగా ప్రకటించారు.
డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్, దక్షిణ కొరియా, జపాన్, మలేసియా, ఆతిథ్య ఒమన్ జట్లు తలపడిన ఈ సమరంలో భారత్ ఒక్కటే ఓటమిలేని జట్టుగా నిలిచింది. సెమీఫైనల్లో జపాన్ ను భారత్ 3-2 గోల్స్ తో అధిగమిస్తే....రెండో సెమీఫైనల్లో మలేసియాను పెనాల్టీ షూటౌట్ ద్వారా పాకిస్థాన్ కంగు తినిపించి...టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది. గత నాలుగు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలలోనూ...భారత్, పాక్ జట్లు చెరో రెండుసార్లు విజేతలుగా నిలడం విశేషం.

ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్ 2011, 2016 టోర్నీలలో విజేతగా నిలిస్తే...2012, 2013 టోర్నీల్లో పాకిస్థాన్ చాంపియన్ గా సత్తా చాటుకొంది. 2018 టోర్నీలో ఈ రెండుజట్లే తిరిగి సంయుక్త విజేతలుగా ట్రోఫీ అందుకొన్నాయి. టోర్నీ లీగ్ దశలో భారత్ 3-1 గోల్స్ తో పాకిస్థాన్ ను చిత్తు చేయడమే కాదు...ఒక్క ఓటమిలేని జట్టుగా నిలిచింది. అంతకుముందు ...మూడోస్థానం కోసం జరిగిన పోటీలో ఆసియాక్రీడల గోల్డ్ మెడలిస్ట్ జపాన్ పై మలేసియా.. పెనాల్టీ షూటౌట్ ద్వారా 3-2 గోల్స్ తో విజేతగా నిలచింది. మొత్తం మీద ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మొదటి ఐదుటోర్నీల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల ఆధిపత్యమే కొనసాగింది. భువనేశ్వర్ వేదికగా నవంబర్ 28న ప్రారంభమయ్యే 2018 ప్రపంచకప్ హాకీలో భారత్ తన అదృష్టం పరీక్షించుకోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories