ఈ ఉదయం పేపర్‌ చూసి షాకయ్యా: కేటీఆర్‌

Submitted by arun on Thu, 03/08/2018 - 17:56
ktr

ఈ రోజు ఉదయం పేపర్‌లో అశోక్ గజపతిరాజు రాజీనామా చేసినట్లు వచ్చిన వార్త చూసి షాకయ్యానని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం బేగంపేటలో వింగ్స్ ఇండియా సదస్సుకు హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ సదస్సుకు అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందని, కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని, అందుకే రాలేకపోయారని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని, విమానయాన మంత్రిగా ఆయన సేవలు ప్రశంసనీయమని కేటీఆర్ కొనియాడారు. దేశంలో 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే  అశోక్ గజపతి రాజు సారథ్యంలో గడిచిన మూడేళ్లలో 50 నుంచి 60కిపైగా విమానాశ్రయాలు కొత్తగా ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. భారత వైమానిక రంగం ఇలాగే వృద్ధి చెందాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

English Title
Ashok Gajapati Raju is an Exciting Politician says Minister KTR

MORE FROM AUTHOR

RELATED ARTICLES