కేంద్రమంత్రి పదవులకు అశోక్, సుజనా రాజీనామా

Submitted by arun on Thu, 03/08/2018 - 18:07
Ashok Gajapathi Raju, Sujana Chowdary

కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయిన ఇద్దరు రాజీనామాలు సమర్పించారు. కాగా పౌర విమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా సుజనా చౌదరి ఉన్న విషయం తెలిసిందే. 2014 మే 26న మంత్రిగా అశోక్ గజపతి, నవంబర్ 9న సుజనా చౌదరి బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ ఇద్దరూ మోదీని కలవడానికి వెళ్లినప్పుడు తమ సొంత వాహనాల్లో వెళ్లడం గమనార్హం. రాత్రి 7గంటలకు అశోక్, సుజనా ఇద్దరూ మీడియాతో మాట్లాడనున్నారు.

English Title
Ashok Gajapathi Raju and Sujana Chowdary quit

MORE FROM AUTHOR

RELATED ARTICLES