అత్యాచార కేసు : ఆశారాం బాపు దోషే

Submitted by arun on Wed, 04/25/2018 - 11:24
Asaram bapu

మైనర్ బాలికపై రేప్ కేసులో ఆశారాం బాపూని జోధ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల కిందట నమోదైన అత్యాచారం కేసులో.. ఆశారాంతో పాటు మరో ముగ్గురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు ఆశారాం బాపుపై కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2013 సెప్టెంబరు 1న ఆశారాంను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 7నే వాదనలు పూర్తవగా.. ఆశారాంను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెల్లడించింది. ఆశారాంను దోషిగా తేల్చడంతో.. జోధ్‌పూర్ అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 30 వరకు 144 సెక్షన్ విధించారు. అదేవిధంగా.. దేశవ్యాప్తంగా ఆశారాం ఆశ్రమాలపై గట్టి నిఘా ఉంచారు.
 

English Title
Asaram has been convicted of raping a 16-year-old girl from Uttar Pradesh’s Shahajahanpur

MORE FROM AUTHOR

RELATED ARTICLES