ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్ట విరుద్ధం : అసదుద్దీన్ ఓవైసీ

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్ట విరుద్ధం : అసదుద్దీన్ ఓవైసీ
x
Highlights

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్ట విరుద్ధమన్నారు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఓవైసీ...

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు చట్ట విరుద్ధమన్నారు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఓవైసీ ముస్లింలను సంప్రదించకుండా బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్నారు. ఈ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం జరగదన్నారు అసదుద్దీన్‌ ఓవైసీ. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుతో ఆర్టికల్‌ 14, 15కి ఉల్లంఘన జరుగుతుందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ద్వారా ఫిర్యాదు చేస్తే అరెస్ట్‌ చేసే పరిస్థితి ఏర్పడుతుందని, భర్త జైలుకెళ్తే ఆ మహిళ పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటారన్నారు. ముస్లింల్లో వివాహం సివిల్‌ వ్యవహారమైతే కేంద్రం మాత్రం క్రిమినల్‌ కేసులు పెట్టేలా చట్టం తేవడం సరైంది కాదన్నారు. వాస్తవాలకు దూరంగా ట్రిపుల్‌ తలాక్ బిల్లు ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories