మోదీ గెలుపుపై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీ గెలుపుపై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, గుజరాత్ లో ముస్లింలను మరింత...

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, గుజరాత్ లో ముస్లింలను మరింత అణగదొక్కారనేదానికి ఈ ఫలితాలే నిదర్శనమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు గుళ్లు, గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఓట్ల కోసమే వీరు ఇలాంటి చర్యలకు దిగారని విమర్శించారు. గుజరాత్ లో బీజేపీని మట్టికరిపించడానికి కాంగ్రెస్ కు మంచి అవకాశం వచ్చిందని, కానీ ఆ పార్టీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. గుజరాత్ లో వ్యాపారులు ఎక్కువగా ఉన్న సూరత్ లో కూడా బీజేపీ హవా చాటిందని జీఎస్టీపై కాంగ్రెస్ గొంతు చించుకున్నా ఫలితం దక్కలేదని అన్నారు.

కేంద్రంలో కాషాయ పార్టీని ఓడించాలంటే ప్రతిపక్షాలు చేతులు కలపాలన్నారు. ‘అఖిలేశ్‌ యాదవ్, మమతా బెనర్జీ, అసదుద్దీన్‌ ఒవైసీ.. విడివిడిగా బీజేపీని ఓడించలేరు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యకూటమి ఏర్పాటు కావాలని, అప్పుడే కమల దళాన్ని ఓడించగలమ’ని పేర్కొన్నారు. బీజేపీ వరుస విజయాలపై స్పందిస్తూ.. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితంలో ఉన్నత దశలో ఉన్నప్పుడే ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. దేశంలో ప్రతిపక్షాలు బలహీనపడినప్పుడు ప్రజలే విపక్షంగా మారి ప్రభుత్వాలను గద్దె దించారని వివరించారు. గుజరాత్‌లో అద్భుతంగా పనిచేసిందని బీజేపీ అనుకుంటే పునరాలోచించాల్సిన అవసరముందన్నారు. ఔరంగజేబు, పాకిస్తాన్‌ పేరుతో బీజేపీ ఎల్లప్పుడూ ఓట్లు సంపాదించలేదని అసదుద్దీన్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories