మళ్లీ ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టునున్న అరుణ్ జైట్లీ...  

మళ్లీ ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపట్టునున్న అరుణ్ జైట్లీ...  
x
Highlights

కొంత విరామం తర్వాత కేంద్రమంత్రి గా ఉన్న అరుణ్ జైట్లీ మళ్లీ ఆర్థిక శాఖ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోనున్నారు. ఆగస్టు రెండో వారంలో జైట్లీ విధుల్లోకి...

కొంత విరామం తర్వాత కేంద్రమంత్రి గా ఉన్న అరుణ్ జైట్లీ మళ్లీ ఆర్థిక శాఖ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోనున్నారు. ఆగస్టు రెండో వారంలో జైట్లీ విధుల్లోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా అఖండ విజయం సాధించిన తర్వాత ప్రధానిమోదీ కేబినేట్ లో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న జైట్లీని మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో జైట్లీ గత మే నెలలో విధుల నుంచి తప్పుకున్నారు. దీంతో రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కోలుకున్న అరుణ్‌జైట్లీ తిరిగి ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నార్త్‌ బ్లాక్‌లోని ఆయన కార్యాలయానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు. ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పియూష్‌ గోయల్‌ ఆర్థికమంత్రిగా ఉన్నప్పటికీ ఇటీవల జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అంశంలోనూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు ఇంతకీ దేశ ఆర్థిక మంత్రి ఎవరు? అంటూ నిలదీశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories