ఏపీలో వైసీపీ హ‌వా..తేల్చి చెప్పిన స‌ర్వే

Submitted by lakshman on Fri, 01/19/2018 - 12:07
jagan

2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్. జ‌గ‌న్ గెలుస్తాడని  కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అర్న‌బ్ గోస్వామి దేశంలోని ఎంపీల సీట్ల‌ను ప్రాతిప‌దిక‌గా చేసుకొని సీ - ఓట‌ర్ అనే స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో  వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌నే విష‌యం తేట‌తెల్ల‌మైంది. దేశవ్యాప్తంగా ఎన్డీయే హవా కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించింది. 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో  పోటీ చేస్తే ఏపీలో ఉన్న25 ఎంపీ సీట్లలో 13 సీట్లను వైసీపీ గెలుస్తుంద‌ని తేల్చి చెప్పింది. బీజేపీ తో పొత్తు ఉంటే టీడీపీకి  12 సీట్లు అవ‌కాశం ఉంది. లేదంటే అన్ని సీట్లు దక్కడం కూడా కష్టమేన‌ని సూచించింది. 
రాష్ట్రంలో వైసీపీ అధికారం దిశ‌గా అడుగులు వేస్తూ ఒక్కో ఎంపీ సీటు కనీసం ఏడు అసెంబ్లీ స్థానాల,  అంతకు మించి కూడా ప్రభావాన్ని చూపుతాయంట‌. ఇక కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావాల‌ని ఏపీ ప్ర‌జ‌లు కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.  ఎంపీ సీట్ల విషయంలో వైసీపీ హవా ఉంటుందని ...అదే అంశం ఎమ్మెల్యే సీట్ల విష‌యంలో  సానుకూలత చూపించ‌నుంది. 
కాగా ఈ స‌ర్వే ఆధారంగా ఏపీలో ప్ర‌భుత్వానికంటే ప్ర‌తిప‌క్ష‌పార్టీ బ‌లంగా ఉంద‌నేది ఆసక్తిదాయకమైన అంశం. ఇదే హ‌వా ఎన్నిక‌ల స‌మయంలో కూడా కొన‌సాగితే వైసీపీ కి లాభం చేకూరుతుంద‌ని పొలిటిక‌ల్ క్రిటిక్స్ చెబ‌తున్న‌మాట‌. 

English Title
Arnab Goswami Republic TV Survey On AP Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES