అరిటాకులో భోజనం నిషేధం.. కారణం ఏంటంటే..

అరిటాకులో భోజనం నిషేధం.. కారణం ఏంటంటే..
x
Highlights

అరిటాకులో భోజనం అనే పద్ధతి ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. అయితే అరిటాకులో భోజనం చేసే పద్దతిని నిషేధించేందుకు పావులు కదుపుతోంది బీబీఎంపీ(బెంగళూరు...

అరిటాకులో భోజనం అనే పద్ధతి ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. అయితే అరిటాకులో భోజనం చేసే పద్దతిని నిషేధించేందుకు పావులు కదుపుతోంది బీబీఎంపీ(బెంగళూరు పాలికె). బెంగుళూరు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న చెత్తను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటోంది. నగరంలో పలు హోటళ్లు సహా ఫంక్షన్ లలో అరిటాకును వినియోగిస్తున్నారు. అయితే పారిశుద్ద కార్మికులు వాటిని డంపింగ్‌ యార్డులకు తరలించి ఎరువుగా మార్చలేక, భారీగా చెత్త పేరుకుపోతోందని భావిస్తున్నారు. దాంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియా ప్రభలుతుందని అధికారులు గుర్తించారు. దాంతో అరిటాకు భోజనం సంప్రదాయమే అయినా నిషేధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. అరిటాకులకు బదులుగా స్టీల్ ప్లేట్లలో భోజనం చేయడం వలన చెత్తను నివారించవచ్చని.. ఇప్పటినుంచే వాటినే వినియోగించేలా చర్యలు చేపడతామని వారు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories