వాట్సాప్ అడ్మిన్ లకు పోలీసులకు హెచ్చరిక!

వాట్సాప్ అడ్మిన్ లకు పోలీసులకు హెచ్చరిక!
x
Highlights

వాట్సాప్ అడ్మిన్ లకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్ లో ఏదో ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాన్ని అలాగే వదిలేస్తుంటారు. ఇకపై అలాంటి వాటిపై ప్రత్యేక...

వాట్సాప్ అడ్మిన్ లకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్ లో ఏదో ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాన్ని అలాగే వదిలేస్తుంటారు. ఇకపై అలాంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంటుందని పొరపాటున కూడా క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్నేహితులతో గ్రూప్ చాటింగ్ కోసమో లేక కుటుంబసభ్యులతో సరదా ముచ్చట్ల కోసమో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటారు. కాని రోజులకు దానిమీద ధ్యాస తగ్గి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ క్రమంలో గ్రూప్ క్రియేట్ చేసిన వ్యక్తి ఒక్కోసారి వేరే వారికీ అడ్మిన్ బ్యాగ్యతలు ఇచ్చి తప్పుకుంటారు. దీంతో గ్రూప్ లోకి సంబంధంలేని అంశాలు, చిత్రాలు,అస్లీల వీడియోలో వస్తుంటాయి అయితే అవి ఇష్టం లేని కొందరు సదరువ్యక్తిపై గ్రూప్ అడ్మిన్ కు ఫిర్యాదు చేస్తారు ఒకవేళ అతను సరిగా రెస్పాండ్ కానీ పక్షంలో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే గ్రూప్ క్రియేట్ చేసిన అడ్మిన్ దే బాధ్యత కనుక అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశముందని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్ హెచ్చరించారు.. అంతేకాకుండా గతకొన్ని రోజులుగా వాట్సప్‌లో పుకార్లు పెరిగాయని. కిడ్నాపింగ్‌ ముఠాలు, దోపిడీ గ్యాంగులు వచ్చాయంటూ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. ఇది తీవ్రమైందని పరిస్థితులు చేతులు దాటేలా, అమాయకులు ఇబ్బందులు పాలయ్యేలా, ప్రజా జీవితానికి భంగం కలిగించేలా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రచారం చేయడం నేరం. ఇలాంటివి షేర్‌ చేసిన వారితో పాటు ఆయా గ్రూపుల అడ్మిన్లూ నేరం చేసినట్లే అవుతుంది. దీంతో అడ్మిన్ లు అలాంటివి షేర్ కాకుండా ఓ కంట కనిపెట్టాలని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories