ప్రాణాంత‌కంగా మారిన పావురాలు

Submitted by arun on Sun, 01/07/2018 - 17:38

పావురం.. ఇది శాంతికి చిహ్నం. అంతేకాదు...ప్రేమికులకు ఇష్టమైనది. దీంతో పావురాన్ని ఇళ్లల్లో పెంచుకోవడంతోపాటు.. బయట ప్రాంతాల్లో ఎక్కువ సేపు వాటితో గడిపేందుకు ముచ్చటపడతారు. కానీ, ఆ పావురం వల్ల మనిషి ప్రాణానికి హాని కలుగుతుందని మీకు తెలుసా...? వాటివల్ల మనికి వస్తున్న ముప్పేమిటో తెలుసా..? 

పావురాన్ని మనం ప్రేమిస్తుంటే.. దాని ఎఫెక్ట్‌తో మనిషి ప్రాణానికి ముప్పు వస్తోంది. హైదరాబాద్ జంటనగరాల్లో ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ మనకు పావురాలు కనిపిస్తుంటాయి. కనిపించాయి కదా అని వాటి దగ్గరకు వెళ్లారో అంతే. ప్రాణాంతక వ్యాధులను కొనితెచ్చుకున్నట్టే. నిజం. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయబారి పాత్ర పోషించిన పావురాలు.. ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి రకారకాలుగా మారాయి.

పావురాలకు ప్రత్యేకంగా మూత్రకోశం ఉండదు. దీంతో విసర్జనలోనే మల,మూత్రాలు ఉంటాయి. వీటి రెట్టల నుంచి ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు గాల్లో కలిసిపోతాయి. ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ప్రజలు వ్యాధిగ్రస్తులవుతున్నారు. కానీ, ఈ విషయం తెలియని ప్రజలు ఆ పావురాలతో గడిపేందుకు వస్తున్నారు. పావురాల వల్ల ఆయాసం, దగ్గు లాంటి శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జలుబు, జ్వరంతో మొదలై.. ప్రాణాంతకంగా మారుతుందంటున్నారు. చూశారుగా.. పావురమే కదా అని దగ్గర కెళ్లారో.. వ్యాధులు కొనితెచ్చుకున్నట్టే. బీకేర్ ఫుల్. 

English Title
Are Pigeons A Threat To Humans?

MORE FROM AUTHOR

RELATED ARTICLES