అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 02/09/2018 - 13:47
MP Kothapalli Geetha

అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా కంటే ప్యాకేజీ మేలని సన్మానాలు చేసి...ఇప్పుడెందుకు మాట మార్చారని మండిపడ్డారు. టీడీపీతో కలిసున్నా ఇవ్వని ప్రత్యేక హోదా....వైసీపీ కలిస్తే ఎలా వస్తుందని ప్రశ్నించారు. జగన్‌ బీజేపీని తిట్టకుండా టీడీపీనే ఎందుకు తిడుతున్నారో చెప్పాలన్నారు. టీడీపీ, వైసీపీలకు చిత్తశుద్ది లేదని పార్లమెంట్‌లో నిరసన అంతా ఒక డ్రామా అన్నారు. చిత్తశుద్ది ఉంటే అందరూ కలసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.

నేను వరసలో నిలబడలేదని నిందించేవారు ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని గీత డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్రం ఎందుకు లెక్కలు చెప్పడం లేదన్నారు. తన నియోజకవర్గానికి 25వేల కోట్ల తీసుకొస్తే ఒక్క పైసా లెక్క లేదని ఆ నిధులను ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

English Title
Araku mp Kothapalli Geetha sensational comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES