మహాకూటమిలో బుజ్జగింపుల పర్వం

Submitted by arun on Thu, 11/08/2018 - 14:05
mahakutami

కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు, అసంతృప్తులను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్తులను వార్ రూం సమావేశానికి ఆహ్వానించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి, సామాజిక సమీకరణాలను వివరిస్తూ బుజ్జగిస్తున్నారు. రాష్ట్రంలో 2004 తరహా పరిస్ధితులు ఉన్నాయని  నాటి తరహాలోనే ఇప్పుడు కూడా పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నందున అంతా సహకరించాలంటూ కోరుతున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా అంతా సహకరించాలని కోరుతున్న నేతలు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే, కార్పోరేషన్ పదవులు ఇస్తామంటూ నచ్చజెబుతున్నారు. ఈ రోజు జరిగిన వార్ రూం సమావేశానికి పాల్వాయి స్రవంతి, ప్రేమ్ సాగర్ రావు, చంద్ర శేఖర్, బండ కార్తీకరెడ్డితో పాటు పలువురు ఆశావాహులు హాజరయ్యారు.  

English Title
Appeasement in Grand Alliance

MORE FROM AUTHOR

RELATED ARTICLES