బాబును ఇరకాటంలో పెడుతున్న “హోదా”

బాబును ఇరకాటంలో పెడుతున్న “హోదా”
x
Highlights

ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్టు తయారైంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి.. ఒకింత విమర్శలకూ దారి...

ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్టు తయారైంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి.. ఒకింత విమర్శలకూ దారి తీస్తోంది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు.. గత ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ నేతలు కూడా విపరీతంగా జనాల్లోకి తీసుకుపోతున్నారు. రహదారుల దిగ్బంధనం పేరుతో జనాల్లో కొత్త చర్చకు తెర తీస్తున్నారు. ఇది.. టీడీపీ సర్కారుకు ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెడుతోంది.

ఒకప్పుడు హోదా కావాలని పట్టుబట్టిన టీడీపీ నేతలు.. తర్వాత హోదాతో ఏమొస్తుంది.. కేంద్రం ఇచ్చే రాయితీ అయినా పర్వాలేదు కదా.. అనేంతగా మాట మార్చారు. తర్వాత.. కేంద్రం నుంచి ప్యాకేజీ కాదు కదా.. చిన్న పాకెట్ మనీ ముక్క కూడా రాకపోవడంతో.. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. రాజధాని నిర్మాణాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలు కూడా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు.

వైసీపీ, కాంగ్రెస్ లకు తోడు.. మధ్యలో పవన్ కల్యాణ్ కూడా జనసేన తరఫున నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటు చేసి.. చంద్రబాబు సర్కారుపై పరోక్ష యుద్ధం చేస్తుండడంతో ఆ పార్టీకి ఇబ్బంది కర పరిస్థితి ఎదురవుతోంది. అందుకే.. ఇప్పుడు చంద్రబాబు కక్కలేక.. మింగలేక అన్న స్థితిని ఎదుర్కొంటున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ముంచుకురానున్నాయి. అంతలోనే.. విపక్షాలు ఇంతలా హోదా విషయాన్ని రాజకీయం చేస్తుండడంతో.. చంద్రబాబు బీజేపీతో తాడో పేడో తేల్చేకునే పరిస్థితి వచ్చింది.

అందుకే.. ముందు ముందు.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలను ఎంత మాత్రం కొట్టిపారేయలేం అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories