మలుపుతిరుగనున్న ప్రత్యేక హోదా ఉద్యమం!

Submitted by nanireddy on Wed, 05/09/2018 - 18:41
ap special status issue

ప్రత్యేక హోదా ఉద్యమం మరో మలుపు తిరగబోతోందా..? ఉద్యోగ సంఘాలు కూడా పోరుబాట పట్టనున్నాయా..? APNGO నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరగబోదోందా..? సమైక్య హోదా సమయంలో ఏర్పడిన జేఏసీ మరోసారి ప్రత్యేక హోదా కోసం తెరపైకి రానుందా..? 

 ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీ ఎన్జీవోలు ధర్నాలు చేపట్టారు. 13 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర నిరసనకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ దగ్గర కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేయని ప్రస్తుత పరిస్థితుల్లో.. పార్టీలను, అన్ని సంఘాలను ఒకే తాటిపైకి తెచ్చి పోరాటం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. సమైక్య ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన జేఏసీని త్వరలో సమావేశపరచి కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు.నిజానికి.....సమయం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యోగులు కూడా ఉద్యమిస్తారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు.గత శనివారం హెచ్ఎంటీవీ విజయవాడలో నిర్వహించిన దశదిశ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఉద్యోగుల జీతాలకంటే... రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ధశ దిశ వేదికగా ప్రకటించారు.

అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్జీవో సంఘం నేతలు బెంగళూరు వెళ్ళి అక్కడి తెలుగువారితో భేటీ కావడంపై ఏపీ బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. బెంగళూరులో అశోక్‌ బాబు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎన్నికల ప్రచారం చేయడం సర్వీసు రూల్స్‌కి విరుద్ధమని అశోక్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కర్ణాటకలో అశోక్‌ బాబు ఎన్నికల ప్రచారం వివాదం ఎలా ఉన్నా... ఏపీ ఎన్జీవోలు కూడా ప్రత్యేక హోదా ఉద్యమంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. జేఏసీ నేతృత్వంలో హోదా పోరు జరిగితే..ఉద్యమం ఎలాంటి మలుపు తిరుగుతుంది....అనేది ఆసక్తికరంగా మారింది
 

English Title
ap special status issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES