డీఎస్సీ నోటిఫికేషన్ల భర్తీలో ఏపీ దూకుడు

Highlights

ఏపీలో మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతోంది. రెండేళ్ల తర్వాత భారీ సంఖ్యలో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. మరి తెలంగాణలో మాత్రం ఇంతవరకు ఒక్కసారి...

ఏపీలో మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతోంది. రెండేళ్ల తర్వాత భారీ సంఖ్యలో టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. మరి తెలంగాణలో మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా ఉపాధ్యాయ ఉద్యోగాలను
భర్తీ చేయలేదు. ఉద్యోగాలు ఇవ్వడంలో ఏపీ దూకుడుమీదుంటే తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదు. ఎందుకిలా..? లోపం ఎక్కడుంది..?

ఏపీలో రెండేళ్లలో రెండోసారి డీఎస్సీ..తెలంగాణలో మూడున్నర ఏళ్లలో ఒకటే నోటిఫికేషన్..ఆ ఒక్క నోటిఫికేషన్‌‌కూ ఎన్నో అడ్డంకులు, మరెన్నో సమస్యలు

ఏపీలో మళ్లీ టీచర్ ఉద్యోగాల జాతర మొదలైంది. 12 వేల 370 పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్ రాబోతోంది. ఇప్పటికే 2015లో 10 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు సర్కార్ మరోసారి 12 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. కానీ తెలంగాణలో మాత్రం మూడున్నర ఏళ్ల తర్వాత టీఆర్టీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చినా దానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. 8792 పోస్టుల భర్తీకి టీఆర్ఎస్ సర్కారు అక్టోబరు 21న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 31 జిల్లాల ప్రకారం భర్తీ చేసేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించడంపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పాత 10 జిల్లాల ప్రకారమే భర్తీ చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తున్నారు.

నిజానికి ఏపీలో కంటే తెలంగాణలోనే టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఎక్కువ ఉన్నాయని నిరుద్యోగ సంఘాల ఆరోపణ. కానీ ఇప్పటి వరకు భర్తీనే చేట్టనేలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మార్చిలోగా పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలి. దీంతో ఏపీలో మరో నోటిషికేషన్ ఇస్తే తెలంగాణలో భర్తీ ప్రక్రియ మాత్రం నెమ్మదిగా సాగుతోంది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే టీఆర్టీ అని తెలంగాణ విద్యాశాఖ ఊరిస్తూ వచ్చింది. కానీ అమలులోకి వచ్చే సరికి బోల్తా కొట్టింది. నోటిఫికేషన్ పక్కాగా లేకపోవడంతో మధ్యలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు మండి పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో రెండేళ్ళల్లో 22 వేల టీచర్ ఉద్యోగాలు ఇస్తుంటే...తెలంగాణ వచ్చాక ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. మరి నిరుద్యోగుల ఆవేదనను TSPSC ఆలకిస్తుందా..? ఈసానైనా..లోపాలు లేని నోటిఫికేషన్ ఇస్తుందా వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories