కొత్త డీజీపీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కొత్త డీజీపీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ కొత్త పోలీస్‌ బాస్‌గా...

ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ కొత్త పోలీస్‌ బాస్‌గా ఎంపికయ్యారు. 1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అయిన ఆర్పీ ఠాకూర్‌ సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఏసీబీ డీజీగా అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఎంతో మంది అవినీతి తిమంగలాలను పట్టుకుని శెభాష్‌ అనిపించుకున్నారు. 1961 జులై 1న జన్మించిన ఆర్పీ ఠాకూర్‌ పూర్తి పేరు రామ్‌ ప్రకాశ్‌ ఠాకూర్‌. ఐఐటీ కాన్పూర్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన ఆర్పీ ఠాకూర్‌‌ 1986లో ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించిన రామ్‌ ప్రకాశ్‌ ఠాకూర్‌ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ డీజీగా పనిచేస్తూ ఇప్పుడు ఏపీ పోలీస్‌ కొత్త బాస్‌గా ఎంపికయ్యారు.

1986 డిసెంబర్‌ 15న ఐపీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్పీ ఠాకూర్‌ గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఏఎస్పీగా పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్‌లో డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో డీఐజీగా బాధ్యతలు నిర్వహించిన ఆర్పీ ఠాకూర్‌‌ హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీకి తొలి అదనపు ఎస్పీగా పనిచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories