హీరోయిన్ పూన్ కౌర్ పై స్పందించిన మంత్రి

Submitted by lakshman on Tue, 01/09/2018 - 11:22
pk

క‌త్తిమ‌హేష్ వివాదంలో హీరోయిన్ పూన్ కౌర్ పై మంత్రి స్పందించారు. మ‌హేష్ ..పూనమ్ కౌర్ వ్య‌క్తిగ‌త జీవితం పై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భంగా మ‌హేష్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది? అంటూ పూన‌మ్ ను ప్ర‌శ్నించారు. అయితే పూన‌మ్ కౌర్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసీడర్ వ్య‌వ‌హారంపై ఏపీ చేనేత శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర స్పందించారు. తాను చేనేత మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎవ‌ర్ని అంబాసీడ‌ర్ గా ఎంపిక చేయ‌లేదని చెప్పారు. అంతేకాదు బ్రాండ్ అంబాసీడ‌ర్ అనే వ్య‌వ‌హారం ప్ర‌భుత్వ ప‌రంగా జ‌ర‌గ‌లేద‌ని, కొంత‌మంది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో చేనేత వ‌స్త్రాల‌కు బ్రాండ్ అంబాసీడ‌ర్ గా ఉండాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. అంతే త‌ప్ప ఏపీలో చేనేత వ‌స్త్రాల‌కు సంబంధించి బ్రాండ్ అంబాసీడ‌ర్ గా ఎవ‌ర్ని నియ‌మించలేద‌ని స్ప‌ష్టం చేశారు. 

English Title
ap minister kollu ravindra respond on poonam kaur

MORE FROM AUTHOR

RELATED ARTICLES