ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Submitted by arun on Tue, 10/23/2018 - 15:03
IPS Officers

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 14 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. విశాఖపట్నం రూరల్‌ ఎస్పీగా బాబూజీ అత్తాడ, గుంటూరు రూరల్‌ ఎస్పీగా రాజశేఖర్‌బాబు, నెల్లూరు ఎస్పీగా ఐశ్వర్య, కర్నూలు ఎస్పీగా ఫకీరప్పను బదిలీ చేశారు. కడప ఎస్పీగా అభిషేక్‌ మహంతి, చిత్తూరు ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌, తిరుపతి అర్బన్‌ ఎస్పీగా అన్జురాజన్‌, విశాఖపట్నం సిట్‌ ఆఫీసర్‌గా రాహుల్‌దేవ్‌ శర్మను బదిలీ చేశారు. విజయవాడ సిటీ లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా వెంకట అప్పలనాయుడుని, విశాఖపట్నం లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీగా నయీంఅస్మిత్‌ ను ట్రాన్సఫర్ చేశారు. గుంతకల్లు రైల్వే ఎస్పీగా సిద్దార్థ్‌కౌశల్‌, విశాఖపట్నం డీసీపీగా ఎం.రవీంద్రనాథ్‌బాబు, టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా గోపీనాథ్‌ జెట్టిని, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎస్పీగా పీహెచ్‌డీ రామకృష్ణను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

English Title
AP Govt Transfer IPS Officers

MORE FROM AUTHOR

RELATED ARTICLES