నిరుద్యోగులకు ‘యువ నేస్తం’

x
Highlights

ఏపీలోని నిరుద్యోగులకు వరాలు ప్రకటించింది ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన నిరుద్యోగ భృతికి.. ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి...

ఏపీలోని నిరుద్యోగులకు వరాలు ప్రకటించింది ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన నిరుద్యోగ భృతికి.. ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి -యువనేస్తం కింద ఒక్కొక్కరికీ నెలకు వెయ్యి రూపాయిల భృతిని అందించనున్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించిన విధివిదానాలను ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పథకానికి ముఖ్యమంత్రి -యువనేస్తం పేరు పెట్టారు. 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు భృతి అందజేస్తామని చెప్పారు. ఒక్కొక్కరికీ నెలకు వెయ్యి రూపాయిలు అందిస్తామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. నిరుద్యోగ భృతిని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. నిరుద్యోగ భృతికి 600 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని లోకేష్ చెప్పారు. 12 లక్షల మందికి ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా నిరుద్యోగ భృతి అందనుంది.

నిరుద్యోగ భృతిని కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికీ వెయ్యి రూపాయిలు ప్రతినెలా ఇస్తామన్నారు మంత్రి లోకేష్. నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్లో నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 3 లేదా 4 వారాల్లో నిరుద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభంకానుంది. నమోదు ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలోనే మొదటిసారిగా నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. లోటు బడ్జెట్ ఉన్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించామన్నారు.

పీఎఫ్‌ పరిధిలోకి వస్తే నిరుద్యోగ భృతి ఆగిపోతుందని అందుకే నిరుద్యోగులకు పెన్షన్ స్కీమ్ ను అమలు చేయడంలేదని లోకేష్ చెప్పారు. అప్రెంటీస్‌ కింద పలు సంస్థల్లో నిరుద్యోగులకు పనికల్పించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఈ పథకాన్నిప్రతిష్టాత్మంకంగా బావిస్తున్న ప్రభుత్వం.. పారదర్శకంగా అమలయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories