పొత్తు ఎఫెక్ట్ : కాంగ్రెస్ కు కీలకనేత రాజీనామా..

Submitted by nanireddy on Fri, 11/09/2018 - 20:58
ap-congress-leder-bala-raju-resigns-party

ఏపీలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీతో పొత్తుల వ్యవహారం కొంపముంచుతోంది. తాజాగా టీడీపీతో పొత్తు వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అయన తన రాజీనామా లేఖను మెయిల్ ద్వారా ఏపీసీసీ అధ్యక్షుడికి పంపించారు. మూడున్నర దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీమంత్రి బాలరాజు ఇవాళ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవడం చర్చనీయాంస్యమైంది. ప్రస్తుతం అయన విశాఖజిల్లా డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో బాలరాజు గిరిజనశాఖ మంత్రిగా పని చేశారు. కాగా, బాలరాజు త్వరలో జనసేనలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

English Title
ap-congress-leder-bala-raju-resigns-party

MORE FROM AUTHOR

RELATED ARTICLES