ధర్మాబాద్‌ కోర్టుకు వెళ్లాలా..? వద్దా..?

Submitted by arun on Sat, 10/06/2018 - 10:12
babu

బాబ్లీ కేసు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు నలుగురు సీనియర్ మంత్రులతో పాటు అడ్వకేట్ జనరల్ తో సమావేశంకానున్నారు. ఈ కేసు విషయంలో ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకావాలా లేదా అనే అంశంపై చర్చించనున్నారు. ఒకవేళ వారెంట్ రీకాల్ చేయకపోతే ఏమి చేయాలి సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల15న కోర్టుకు హాజరుకావాలని సీఎం సహా మరో 14 మందిని ధర్మాబాద్‌ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

బాబ్లీ కేసు వ్యవహారంపై శుక్రవారం సాయంత్రం మంత్రులు, అధికారులతో చంద్రబాబు నిశితంగా చర్చించారు. ధర్మాబాద్‌ కోర్టుకు హాజరుకావాలా వద్దా..? అనే అంశంపై చర్చించడం జరిగింది. భారీగా ర్యాలీతో కోర్టుకు హాజరైతే బాగుంటుందని అచ్చెన్నాయుడు సూచించారు. మరో మంత్రి యనమల వారెంట్ రీకాల్ చేయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇవాళ మరోసారి అడ్వకేట్ జనరల్, సీనియర్ మంత్రులతో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించారు. అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణులతో క్లారిటీగా చర్చిద్దామని మంత్రులకు  చంద్రబాబు చెప్పారు. 

English Title
AP CM Chandrababu To Meet TDP Ministes Over Babli Case

MORE FROM AUTHOR

RELATED ARTICLES