పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది : ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు

Submitted by arun on Sat, 02/10/2018 - 13:51

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకూ 4 వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేశారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మోడీ ప్రభుత్వం తొలిభేటీలోనే 7 మండలాలపై నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఆ మండలాలకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిందని ఆయన చెప్పారు.

 ఏపీకి కేంద్రం మంజూరు చేసిన జాతీయ సంస్థలు, ప్రాజెక్ట్‌లు, నిధులపై 27 పేజీల నోట్‌‌ను బీజేపీ విడుదల చేసింది. ఏపీ లోటుబడ్జెట్‌ను కేంద్రం భర్తీ చేస్తుందని విశాఖ ఎంపీ హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తున్నామని, హోదా వల్లే వచ్చే అన్ని ప్రయోజనాలను ప్యాకేజీలోనే ఇస్తామని మొదటి నుంచి బీజేపీ చెబుతున్న మాటలనే మరోసారి హరిబాబు చెప్పారు. 

దుగరాజపట్నం పోర్టుపై అభ్యంతరాలు వచ్చాయని, వేరే పోర్టును సూచించాలని కేంద్రం కోరిందని హరిబాబు చెప్పారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు కమిటీ వేశారని పేర్కొన్నారు. ఏపీలో లక్ష కోట్లతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని, ఉజ్వల్‌ వంటి కేంద్ర పథకాలను ఏపీ సమర్థంగా వినియోగించుకుంటోందని ఆయన తెలిపారు. కేంద్ర పథకాల వినియోగంతో ఏపీలో 24 గంటల విద్యుత్ అందుతోందని చెప్పుకొచ్చారు. ఏపీకి 6.8 లక్షల ఇళ్లను కేంద్రం కేటాయించిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పారు.

English Title
AP BJP President Haribabu Press Meet

MORE FROM AUTHOR

RELATED ARTICLES