పొత్తులపై పార్టీ నేతలు అదుపులో ఉండాలి

పొత్తులపై పార్టీ నేతలు అదుపులో ఉండాలి
x
Highlights

పొత్తులపై పార్టీ నేతలు అదుపులో ఉండాలని అమిత్ షా అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అధిష్టానం మాటలను నేతలు...

పొత్తులపై పార్టీ నేతలు అదుపులో ఉండాలని అమిత్ షా అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అధిష్టానం మాటలను నేతలు ఎందుకు లెక్క చేయడం లేదు వ్యూహాత్మకంగానే టీడీపీని బీజేపీ టార్గెట్ చేసిందా ? ఒక వేళ విమర్శలు చేసినా...వ్యక్తిగతంగానే చేశామని తప్పించుకుంటారా ?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీల మధ్య మాటలయుద్ధం నడుస్తూనే ఉంది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నేతలకు అదేశాలు జారీ చేశారు. పార్టీలో గ్రూపులను ప్రొత్సహించవద్దన్న అమిత్‌ షా పార్టీ విధానాలకు భిన్నంగా వెళితే చర్యలకు వెనుకాడబోమన్నారు. టీడీపీతో పొత్తుపై జాగ్రత్తగా వ్యవహరించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే అమిత్‌ షా వ్యాఖ్యలను రాష్ట్ర నేతలు లెక్కలోకి తీసుకోవడం లేదు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఇసుక, మట్టి, ఉపాధి హామీ, మరుగుదొడ్లు అన్నింటిలోనూ అక్రమాలే కనిపిస్తున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆయన అధికారులు అక్రమాలకు పాల్పడుతుంటే ప్రజాప్రతినిధులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏదో రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టదని చారిత్రాత్మక బడ్జెట్‌ ప్రవేశపెడితే విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.

టీడీపీ నేతలకు బడ్జెట్‌పై అవగాహన లేకపోవడంతోనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. అమరావతి డిజైనట్లు ఇప్పటికీ ఫైనల్ కాకపోయినా 2వేల 5వందల కోట్లు ఇచ్చామన్నారు. ఏపీకి ఇవ్వని హామీలు ఎన్నో చేశామన్న ఆయన కేటాయింపులు తక్కువ కనిపించినా పూర్తి స్థాయి బడ్జెట్‌ బయటకు రాలేదన్నారు. రైల్వేజోన్ అంశం టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందన్నారు.

బీజేపీ నేతలు వ్యూహాత్మకంగానే ఏపీ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారా ? లేదంటే వ్యక్తిగతంగానే చేస్తున్నారా ? అధిష్టానం విమర్శలు చేయవద్దని చెబుతున్నా...ఎందుకు విమర్శలు చేస్తున్నారు ? టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని బీజేపీ డిసైడ్‌ అయిందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories