డిసెంబర్‌ మొదటివారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

డిసెంబర్‌ మొదటివారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
x
Highlights

డిసెంబర్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మంత్రి వర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా శాసనసభ సమావేశం కానుంది. ఈ సందర్భంగా కొత్తగా...

డిసెంబర్ మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మంత్రి వర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా శాసనసభ సమావేశం కానుంది. ఈ సందర్భంగా కొత్తగా మంత్రివర్గంలో చేరిన మంత్రులు కిడారి శ్రవణ్‌, ఎన్‌ఎండీ ఫరూక్‌లను సీఎం చంద్రబాబు సభకు పరిచయం చేయనున్నారు. ఎన్‌ఎఫ్‌డీ ఫరూక్ మంత్రి వర్గంలోకి రావడంతో ఖాళీ ఏర్పడిన మండలి ఛైర్మన్‌‌ను ఇదే సమావేశంలో ఎన్నుకోనున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్‌‌ను మండలి ఛైర్మన్‌గా ప్రకటించినా సభలోని ఎంపిక జరగాల్సి ఉంది. ఇదే సమావేశాల్లోనే శాసనమండలి ఛైర్మన్‌ను కూడా ఎంపిక చేయనున్నారు. ఇక ఈ సమావేశాల్లో అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి, మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుల మృతికి సంతాప తీర్మానలు ప్రవేశపెట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories