ప్రకాష్ రాజ్-అనుపమ మధ్య గొడవ....స్పందించిన అనుప‌మ‌

Submitted by arun on Thu, 07/12/2018 - 13:22
Anupama

రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా త్రినాథ్‌ రావ్‌ నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హలో గురు ప్రేమ కోసమే'. ఇందులో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల సెట్స్‌లో ప్రకాష్ రాజ్-అనుపమ మధ్య గొడవ జరిగిందని.... ఆ సంఘటన తర్వాత ఒత్తిడికి గురైన అనుపమ కళ్లు తిరిగి పడిపోయిందని, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి అనుపమ స్పందించింది.

"హలో గురు ప్రేమకోసమే' సినిమాకి సంబంధించి నాకు .. ప్రకాశ్ రాజ్ కి మధ్య ఒక సీన్ ను చిత్రీకరిస్తున్నారు. జ్వరం .. లోబీపీ కారణంగా నేను అస్వస్థతకి లోనయ్యాను. దాంతో టైమింగ్ లో డైలాగ్ చెప్పలేక ఇబ్బంది పడ్డాను. నా పరిస్థితిని గ్రహించిన యూనిట్ సభ్యులు వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్స్ ఇచ్చిన మందులు వాడిన తరువాత ఇప్పుడు బాగానే వుంది. ఇంత చిన్న విషయంపై ఇన్ని పుకార్లు రావడం చూసి నాకు నవ్వొస్తోంది. నాకేమీ కాలేదు .. నేను బాగానే వున్నాను .. అభిమానూలు కంగారుపడవలసిన పనిలేదు" అని ఆమె స్పష్టం చేసింది.   

English Title
anupama parameswaran gives clarity on his health

MORE FROM AUTHOR

RELATED ARTICLES