నరకదారి...రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణికి తీవ్ర ఇబ్బందులు

x
Highlights

దేశానికి స్వాతంత్ర్య వచ్చి దశాబ్ధాలు గుడుస్తున్నా ఇంకా సరైన వైద్య సౌకర్యాలు లేని ప్రాంతాలు దేశంలో చాలా ఉన్నాయి. మారుమూల గ్రామాలు, తండాలతో పాటు పట్టణ...

దేశానికి స్వాతంత్ర్య వచ్చి దశాబ్ధాలు గుడుస్తున్నా ఇంకా సరైన వైద్య సౌకర్యాలు లేని ప్రాంతాలు దేశంలో చాలా ఉన్నాయి. మారుమూల గ్రామాలు, తండాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ దుస్థితి నెలకొని ఉంది. తాజాగా విశాఖ పట్టణంలో జరిగిన ఓ సంఘటన ఆ జిల్లాలో వైద్య పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తుంది. ఓ నిండు గర్భిణిని 6 కిలో మీటర్ల పాటు మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆరు కిలోమీటర్లు...అష్టకష్టాలు పడి అరచేత ప్రాణాలు పట్టుకుని నిండు గర్భిణిని కుటుంబ సభ్యులు మోసుకెళ్లారు. రోడ్డు సౌకర్యం లేక పురుటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని కర్రకు దుప్పటి కట్టి నలుగురు మనుషులు సుమారు ఆరు కిలోమీటర్లు మోసుకెళ్లారు.

విశాఖ జిల్లా కోటవురట్ల మండలం గొట్టివాడ పంచాయతీ అణుకు గ్రామానికి చెందిన గమిల లింగో అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి ఫోన్‌ చేశారు. అయితే 108 వాహనం రోడ్డు సౌకర్యం ఉన్నంత వరకే వచ్చి అక్కడే ఆగిపోయింది. సుమారు 6 కిలోమీటర్ల దూరంలోనే అంబులెన్స్ ఆగిపోవడంతో పురిటి నొప్పులతో విలవిల లాడుతున్న మహిళను తప్పనిసరి పరిస్థితుల్లో రెండు కర్రలకు ఓ దుప్పటి కట్టి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టివాడకు మోసుకెళ్లారు. అక్కడ నుంచి కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా వుండటంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొన్నేళ్లుగా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని గిరిజనులు ఆవేదన చెందుతున్నప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు.

అదృష్టం కొద్దీ తల్లి బిడ్డలకు ఎటువంటి హానీ జరగలేదు. నర్శీపట్నం ఏరియా హస్పిటల్ లో పురుడు పోసుకున్న ఆమె పండంటి మగబిడ్డ కు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిబీడ్డలు ఇద్దరూ క్షేమంగా వున్నారు. రహదారులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్రకటనలు గుప్పిస్తున్నాయి. కానీ పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు.ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.

ఇప్పటికైనా అధికారులు, మంత్రులు వాస్తవాలును గ్రహించాల్సిన అవసరం వుంది. ప్రజల నిజమైన అవసరాలను తీర్చడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ది చూపాల్సిన బాద్యత వుంది. రహదారిలేక అష్టకష్టాలు పడుతున్న ఇలాంటి గ్రామాలను గర్తించి మెరుగైన సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories