రాజ‌కీయం చేయోద్దు .నా తండ్రిది స‌హ‌జ‌మ‌ర‌ణ‌మే

Submitted by lakshman on Mon, 01/15/2018 - 04:13

త‌న తండ్రిది స‌హ‌జ‌మ‌ర‌ణమేన‌ని బీహెచ్ లోయా కుమారుడు అనుజ్ లోయా తెలిపారు. 
ఇటీవ‌ల జ‌స్టిస్ బీహెచ్ లోయా కేసుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన న‌లుగురు సుప్రీం న్యాయ‌వాదులు ప్రెస్ మీట్ పెట్ట‌డంతో పెద్ద‌వివాద‌మే చెల‌రేగింది. అయితే దీనిపై స్పందించిన అనుజ్  లోయా త‌న తండ్రి ది స‌హ‌జ‌మ‌ర‌ణేమ‌న‌ని ..త‌మ‌కు ఎలాంటి అనుమానాలు లేవ‌ని అన్నారు. ఇదిలా ఉంటే 
సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ బీహెచ్ లోయా 2014 డిసెంబర్‌లో మృతి చెందారు. ఈ కేసులో అమిత్ షా నిందితుడిగా ఉన్నాడు. అయితే జస్టిస్ లోయా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారంటూ పలువురు లాయర్లు పేర్కొన్నారు. లోయా మరణంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తీవ్రతను గమనించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను సమర్పించాలని చెప్పింది. అయితే ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని.. దీన్ని సుప్రీంకోర్టు విచారించరాదని ప్రముఖ లాయర్ దుష్యంత్ దవే కోర్టును కోరారు.

English Title
Anuj Loya speech about Justice BH Loya

MORE FROM AUTHOR

RELATED ARTICLES