దొంగ చీమ...ఖరీదైన వజ్రాన్ని ఎత్తుకెళ్లి...

x
Highlights

కొంత మంది మనుషులు దొంగ తనం చేయడం చూసి ఉంటాం. కొన్ని సార్లు కోతులు కూడా వాటికి నచ్చిన వాటిని ఎత్తుకెళ్లి జనాన్ని నానా తిప్పలు పెడుతుంటాయి. కానీ ఓ చీమ...

కొంత మంది మనుషులు దొంగ తనం చేయడం చూసి ఉంటాం. కొన్ని సార్లు కోతులు కూడా వాటికి నచ్చిన వాటిని ఎత్తుకెళ్లి జనాన్ని నానా తిప్పలు పెడుతుంటాయి. కానీ ఓ చీమ ఖరీదైన వజ్రాన్ని ఎత్తుకెళ్లి ఔరా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోలోని చీమ దొంగను మీరూ చూసేయండి.

అనగనగా ఓ చీమ ఆ చీమ నోట్లో ఖరీదైన డైమండ్‌. చీమ నోట్లో డైమండ్‌ ఏంటీ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారా..? కానీ ఇది నిజం చీమ లక్షలు విలువై చేసే వజ్రాన్ని చటుక్కున కొట్టేసింది చీమ ఏంటి దొంగతనం చేయడం ఏంటీ అనుకుంటున్నారా సైజ్‌లో చిన్నదని చులకనగా చూసే వారికి ఆ దొంగ చీమ చేసిన పర్ఫామెన్స్‌ చూస్తే ఫిదా అవాల్సిందే.

ఓ వజ్రాల షాపులో దూరిన నల్లచీమ ధగధగ మెరిసిపోతున్న వస్తువుపై కన్నేసింది . ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆశపడింది. మెరిసిపోతున్న ఆ వస్తువును ఎలాగైనా కొట్టేయాలని స్కెచ్‌ వేసింది. అంతే వ్యాపారి తన పని తను చేసుకుంటుంటే చీమ మెల్లిగా ఆయన వద్దకు వెళ్లి తినుబండారం అనుకుందో ఏమో తెలియదు గానీ తన చిట్టి బుర్రకు పదును పెట్టి ఆ వస్తువును చోరీ చేసేసింది.

చీమలు చూడటానికి చిన్నవి గానే ఉంటాయి. కానీ కొన్ని సార్లు అవి చేసే పనులే మతి పోతుంటాయి. వ్యాపారి ఓ కాగితంపై వజ్రాలను వేసి లెక్కిస్తున్నాడు. ఇంతలో ఓ నల్ల చీమ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని వెంటనే అక్కడ వాలిపోయి పుస్తకాల మధ్యలో నుంచి ఆ చీమ వజ్రాల్లో ఒకదాన్ని పట్టుకుని తెగ ఆయాసపడుతూ పెనుగులాడుతూ కష్టపడుతూ తోసుకువెళ్తుంది. చీమ చేస్తున్న ఆ దొంగ పనిని చూసిన వ్యాపారి వెంటనే తన ఫోన్‌లో బంధించాడు. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ చీమ కొట్టేయాలనుకున్న ఆ వజ్రం విలువ మార్కెట్లో సుమారు పది లక్షలకు పైమాటే అంటా.

చీమ చేసిన పని వైరల్ కావడమే కాదు చీమపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. తన గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయడానికే ఆ చీమ వజ్రాన్ని ఎత్తుకెళ్లిందేమో అని కొందరు వామ్మో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని మరికొందరు కామెంట్లు చేశారు. మరి కొందరైతే ఈ దొంగకు ఏ శిక్ష వేస్తారో ఏ జైలుకు పంపిస్తారోనని మాట్లాడుకుంటున్నారు. మరి కొందరు ఓ అడుగు ముందుకేసి ఈ దొంగ చీమ ఏదేశానిదోనని ఇంకొందరు బెట్టింగులు సైతం వేసుకుంటున్నారట.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories