ఎన్టీఆర్ ఖాతాలో మ‌రో పాత టైటిల్‌?

Submitted by kasi on Sat, 09/16/2017 - 19:31

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న సినిమాల‌కు హీరోయిజం ఉట్టిప‌డే టైటిల్స్‌నే కాకుండా క‌థ‌కు స‌రిపోయే టైటిల్స్‌ని కూడా ఎంచుకుంటుంటాడు. ఇంకా అవ‌స‌ర‌మైతే పాత సినిమా టైటిల్స్‌ని కూడా క‌థ డిమాండ్ చేస్తే వాడుకున్న సంద‌ర్భాలున్నాయి. అలాంటి జాబితాలో 'బృందావ‌నం', 'శ‌క్తి' చిత్రాల‌ను చెప్పుకోవచ్చు. ఇప్పుడీ ఖాతాలోనే మ‌రో పాత టైటిల్ తో తార‌క్ సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్స్‌లో వినిపిస్తోంది.  

ఎన్టీఆర్‌తో 'బృందావ‌నం' చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' పేరుతో మ‌రో సినిమాని నిర్మించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో చేయ‌నున్న సినిమా త‌రువాత తార‌క్ ఈ సినిమా చేస్తాడ‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. గ‌తంలో వెంక‌టేష్‌, భానుప్రియ‌, గౌత‌మి హీరోహీరోయిన్లుగా 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' పేరుతో ఓ హిట్ చిత్రం రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ కొత్త చిత్రం 'జైల‌వ‌కుశ' ఈ నెల 21న విడుద‌ల కానుంది.

English Title
another old title in ntr account?

MORE FROM AUTHOR

RELATED ARTICLES