2019 నాటికి పోలవరం పూర్తిచేస్తాం: చంద్రబాబు

Submitted by arun on Mon, 06/11/2018 - 16:55
babu

2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రంవాల్‌ పూర్తయిన సందర్భంగా చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. పోలవరం నిర్మాణంలో డయాఫ్రంవాల్‌ పూర్తిచేయడం ఓ చరిత్ర అని.... పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు నీరందుతుంది తెలిపారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కార్మికులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను అభినందించారు. అనంతరం స్పిల్‌ ఛానల్‌ వద్ద 13 జిల్లాల రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. 

English Title
Andhra CM Naidu inaugurates diaphragm wall pylon of Polavaram project

MORE FROM AUTHOR

RELATED ARTICLES