ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
x
Highlights

సోమవారం నాలుగు గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పలు కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. అలాగే చంద్రబాబు దీక్ష...

సోమవారం నాలుగు గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పలు కొత్త నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. అలాగే చంద్రబాబు దీక్ష ఏర్పాట్లు చూడటానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీక్షలో పాల్గొనాలని కేబినెట్ పిలుపునిచ్చింది.

ఈ నెల 20 నుంచి చంద్రన్న పెళ్లి కానుక పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించించింది. ఈ పథకం కింద బీసీ వధువులకు 35 వేల రూపాయలు , ఎస్సీ వదువులకు 40 వేలు అందచేస్తారు. ఏటా 60 వేల మందికి లబ్ది కలిగే.. పెళ్లి కానుక పథకానికి ఏటా వంద కోట్లు ఖర్చు పెడతారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగుల కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని మరింత పెంచారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇక అగ్రిగోల్డ్

బాధితులకు న్యాయం చేయడాన్ని ఉన్న ప్రత్యామ్నాయ విధానాలపై పై చర్చిస్తున్నామనీ..తుది నిర్ణయాన్ని

ఈ నెల 25 న కోర్టుకు తెలపాలని నిర్ణయించారు.

ఈ నెల 20న సీఎం చేస్తున్న దీక్ష ఏర్పాట్లు చూసేందుకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష జరుగుతుంది. చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా అన్ని నియోజకవర్గాల్లో అన్నివర్గాల ప్రజలు దీక్షలో పాల్గొవాలని కేబినెట్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో విద్వంసం సృష్టించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అభిప్రాయపడిన కేబినెట్ బంద్ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఘటనే నిదర్శనమని ఉదహరించింది.

అలాగే విశాఖ జిల్లా నక్కపల్లిమండలంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం 448.88 ఎకరాల భూమిని ఏపీఏడీసీఎల్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాల్లో ఆక్వా జోన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రి మండలి..

తెలుగుగంగ పథకాన్ని సాగునీటి ప్రాజెక్ట్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. యానిమేషన్,విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదిక చేసే విధంగా కొత్త పాలసీని రూపొందించారు. 2020 నాటికి ఈ రంగాల్లో 6,400 కోట్ల పెట్టుబడి ఆకర్షించే విధంగా విధానాన్ని తయారు చేశారు. విశాఖపట్నంలో 40 ఎకరాల విస్తీర్ణంలో యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ ఏర్పాటు చేస్తారు. ఏపీ యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ సెంటర్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల గేమింగ్, యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పార్కులను ఏర్పాటు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories