సూర్య‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన యాంక‌ర్లు!

సూర్య‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన యాంక‌ర్లు!
x
Highlights

గ్యాంగ్ సినిమా సక్సెస్‌ తో ఆనందంగా ఉన్న సూర్యపై ఓ తమిళ మ్యూజిక్‌ ఛానల్‌ యాంకర్‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాంక‌ర్లు చేసిన చెత్త కామెంట్లు...

గ్యాంగ్ సినిమా సక్సెస్‌ తో ఆనందంగా ఉన్న సూర్యపై ఓ తమిళ మ్యూజిక్‌ ఛానల్‌ యాంకర్‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాంక‌ర్లు చేసిన చెత్త కామెంట్లు త‌మిళ‌నాట వివాదం రెకెత్తిస్తున్నాయి. సూర్య హైట్ గురించి వారు చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అభిమానుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు సూర్య సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ్ న‌టించ‌నున్నార‌ని వార్త‌లు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. దీని గురించి ఓ లైవ్ ప్రోగ్రామ్‌లో యాంక‌ర్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ``సింగం` సినిమాలో అనుష్క‌ను చూసేందుకే త‌ల పైకెత్తిన సూర్య‌.. అమితాబ్‌తో న‌టించాలంటే స్టూల్ వేసుకోవాల్సిందేన‌`ని కామెంట్ చేశారు. ఇవి త‌మిళ‌నాట వివాదాస్ప‌దంగా మారాయి.

సూర్యపై టీవీ యాంకర్లు చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీ వర్గాలు తీవ్రంగా స్పందింస్తున్నారు. హీరో విశాల్‌. ‘ఇది హాస్యమా..?? కానే కాదు. నవ్వించటం కోసం ఎంత అనైతికంగా ప్రవర్తిస్తున్నారు. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశాడు. సూర్య అభిమానులు యాంకర్లు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories