అత్తారింట్లో గొడవ.. ఉరేసుకున్న న్యూస్ రీడర్

Submitted by arun on Mon, 06/18/2018 - 11:59
anchor

విజయవాడలో దారుణం సంభవించింది. ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే, పోలీసుల కథనం ప్రకారం ఈడుపుగల్లు ఎంబీఎంఆర్‌ కాలనీలోని ఫ్లాట్‌ నంబర్‌ 105లో గత కొంత కాలంగా దంపతులు మట్టపల్లి తేజశ్విని, పవన్‌కుమార్‌ ఉంటున్నారు. రెండేళ్ల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. తేజశ్విని ఓ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేసేది. భర్త పవన్‌కుమార్‌ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తేజశ్విని అత్త అన్నపూర్ణాదేవితో గొడవ పడింది. అనంతరం ఇంట్లోని వారు ఉంటున్న గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకీ తేజశ్విని రాకపోవడంతో అనుమానం వచ్చిన అత్త గది వద్దకు వెళ్లి చూసింది. ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English Title
anchor suicide attempt

MORE FROM AUTHOR

RELATED ARTICLES