నాంపల్లి కోర్టుకు యాంకర్‌ రవి

Submitted by arun on Wed, 01/10/2018 - 12:07
Anchor Ravi

ప్రముఖ టీవీ యాంకర్ రవి బుధవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ‘రారండోయ్ వేడుక చూద్దాం...’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో మహిళలను కించపరుస్తూ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను యాంకర్ రవి సమర్థించాడు. దీంతో ఆయనపై ఓ మహిళ గతంలో కేసు పెట్టింది. దీంతో కోర్టు వాయిదా బుధవారం ఉండడంతో రవి కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. కాగా... రవి తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ... తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. అలాగే కేసు విషయాలను సోషల్‌ మీడియా ద్వారా తెలుపుతానన్నారు.
 

English Title
anchor ravi attends nampally court

MORE FROM AUTHOR

RELATED ARTICLES