సోషల్‌ మీడియాలో ప్రదీప్‌ వీడియో హల్‌చల్‌.. తాగొద్ద‌న్నాడు.. తాగేసి దొరికిపోయాడు

x
Highlights

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో మ‌ద్యం తాగి డ్రైవ్ చేయొద్ద‌ని...

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్‌ ప్రదీప్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో మ‌ద్యం తాగి డ్రైవ్ చేయొద్ద‌ని ప్ర‌దీప్ నీతి వాక్యాలు చెప్పాడు. ఇలా నీతి వాక్యాలు చెప్పిన వాడే ఇవాళ త‌ప్పతాగి దొరికిపోయాడంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన వారికి ట్రాఫిక్‌ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు. ఇందు కోసం బేగంపేటలోని ట్రాఫిక్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రావాలని ప్రదీప్‌కు నోటీసులిచ్చారు. అయితే ప్ర‌దీప్‌కి క‌చ్చితంగా రెండు నుంచి వారం రోజుల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories