అన‌సూయ‌కు మ‌రో బంప‌రాఫ‌ర్‌ ?

Submitted by arun on Tue, 04/24/2018 - 17:22
Anasuya

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ ప్ర‌స్తుతం వెండితెర మీద కూడా త‌న స‌త్తా చాటుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన `రంగ‌స్థ‌లం` సినిమా ఆమెకు ఎన‌లేని గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో రంగ‌మ్మత్త‌గా అన‌సూయ అద్భుతంగా న‌టించింది. తాజాగా అన‌సూయ‌కు మ‌రో మంచి అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

తాజాగా ఓ క్రేజీ మల్టీ స్టారర్‌ సినిమాలో అనసూయ నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్‌హిట్ సాధించిన అనిల్‌ రావిపూడి.. వెంకటేష్‌, వరణ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో ‘ఎఫ్‌2 ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ పేరుతో మల్టీ స్టారర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో అనసూయను కీలక పాత్రకు తీసుకున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు.

English Title
Anasuya to play important role in f2 Movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES