అనసూయ ఫ్యాన్స్ నన్ను అక్కడ తిట్టారు : రష్మీ

Submitted by nanireddy on Sun, 06/17/2018 - 09:47
anasooya fans scold in youtube

 అందం, అభినయం తోపాటు నటనలో మెళుకువలు తెలిసిన నటి రష్మీ.. నటిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి యాంకర్ గా సెటిల్ అయింది. ప్రముఖ కామెడీ షో లో  తనదైన శైలి యాంకరింగ్ తో పలువురిని ఆకట్టుకుంటోంది. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా రష్మీ  తన సహచర యాంకర్ అనసూయ గురించి ఆసక్తికర  విషయం వెల్లడించింది. తాను ఆ షో ఒప్పుకోకముందు కేవలం 13 ఎపిసోడ్ లు మాత్రమే కంప్లీట చేసుకుంది.అయితే అనసూయ యాంకరింగ్ నుంచి తప్పుకున్న తరువాత యూట్యూబ్ లో ఆ షో  చూస్తూ నన్ను తిట్టేవాళ్లు అనసూయ అభిమానులు..  అనసూయకున్న ఫాలోయింగ్ అప్పుడే నాకు అర్ధమైంది.. దానికి కారణం ఆ షో లో అను(అనసూయ) యాంకరింగ్ అంతబాగా  చేస్తుండటమేనని చెప్పింది. వృత్తి పరంగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. పైగా తామిద్దరం  మంచి స్నేహితులమని చెప్పి ఎప్పుడైనా హోమ్ ఫుడ్ తినాలంటే అనసూయ ఇంటికే వెళతానని వెల్లడించింది.     

English Title
anasooya fans scold in youtube

MORE FROM AUTHOR

RELATED ARTICLES