టీడీపీకి కొరియర్ పంపిన ఆనం రామనారాయణరెడ్డి

Submitted by nanireddy on Sat, 08/11/2018 - 08:49
anam ramnarayana reddy sent coriour to tdp

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి కొరియర్ పంపించారు. అయన టీడీపీలో చేరిన సందర్బంగా పార్టీ ఇచ్చిన ఐడీకార్డ్, పసుపు కండువాను తిరిగి తెలుగుగుదేశం పార్టీకి ఇచ్చేశారని విశ్వసనీయ సమాచారం. అయన త్వరలోనే వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 16 లేదా 18 న జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే వారంరోజుల కిందటే వైసీపీలో చేరాల్సిన ఆనం ఆషాడమాసం కారణంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే ఓ దఫా జగన్ తో చర్చలు జరిపిన అయన పార్టీలో చేరడానికి దాదాపు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి లేదా ఆత్మకూరు నియోజకవర్గంనుంచి అయన పోటీ చేసే అవకాశముంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కూడా వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయన కూడా వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నారు. 

English Title
anam ramnarayana reddy sent coriour to tdp

MORE FROM AUTHOR

RELATED ARTICLES