వైసీపీలో చేరడంపై స్పష్టం చేసిన మాజీ మంత్రి ఆనం!

Submitted by nanireddy on Thu, 06/14/2018 - 08:21
anam  ramanarayanareddy maybe join in ycp

తన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి మృతితో తాము పెద్ద దిక్కు కోల్పోయామని మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గత కొద్ది రోజులుగా తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన అయన త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు . తమ మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులతో చర్చించిన అనతరం  అతికొద్ది రోజుల్లోనే  రాజకీయ నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీలో తనకు మొదటినుంచి ప్రాధాన్యత సరిగా లేదన్న ఆనం ఇలాంటి  సమయాల్లోనే  ఏ నాయకుడైన ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తారని అన్నారు. ఇదిలావుంటే ఆనం రామనారాయణరెడ్డి వచ్చే నెల 8 వ తేదీన వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది.

English Title
anam ramanarayanareddy maybe join in ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES