టీడీపీకి మాజీ మంత్రి ఆనం గుడ్ బై..?

టీడీపీకి మాజీ మంత్రి ఆనం గుడ్ బై..?
x
Highlights

నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ గట్టుకి చేరతారో తెలియని పరిస్థితి. తాజాగా ఆనం రాంనారాయణ రెడ్డి కథ మళ్ళీ మొదటికి...

నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ గట్టుకి చేరతారో తెలియని పరిస్థితి. తాజాగా ఆనం రాంనారాయణ రెడ్డి కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆయన టీడీపీని వీడటం ఖాయమని విశ్వసనీయ సమాచారం. అనుచరులు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్న ఆనం ఇప్పటికే రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

గత కొద్ది రోజులుగా నెల్లూరు టీడీపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆనం టీడీపీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా ఆనం హాజరుకాకపోవడం, ఆత్మకూరు నియోజకవర్గంలో అభ్యర్థిత్వంపై తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో ఆయన పేరు లేకపోవడంతో ఇక ఆయన టీడీపీలో కొనసాగడం కష్టమేనని తేలిపోయింది. ఇటీవల ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన మినీ మహానాడులో పాల్గొన్న ఆనం..... మంత్రి సోమిరెడ్డి, ప్రభుత్వ వైఫల్యంపై ఘాటైన విమర్శలు చేశారు. దీంతో ఆయన ఉద్దేశ్యమేంటో చెప్పకనే చెప్పిటనట్టయ్యింది.

ఆనం కుటుంబం తెలుగుదేశంలో చేరి మూడేళ్లైంది. చంద్రబాబు తనకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ కావాలన్న కల నెరవేరక ముందే మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. సోదరుడి మృతికి ముందే... ఆనం రామనారాయణరెడ్డి... పార్టీ మారడంపై ఊహాగానాలొచ్చాయి. అయితే వివేకా అంతిమయాత్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు రావడం, ఆనం కుటుంబ సభ్యులతో సమావేశం కావడం, ఆనం రామనారాయణ రెడ్డిని పక్కనే పెట్టుకుని మీడియాతో మాట్లాడం వంటి పరిణామాలతో ఆయన పార్టీ మారే కార్యక్రమానికి బ్రేక్ పడిందనే ప్రచారం జరిగింది.

ఆనం రాంనారాయణ రెడ్డి టీడీపీలోనే ఉంటాడని అనుకున్న తరుణంలో మళ్లీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ నుంచి కూడా ఆయనకు సానుకూల సంకేతాలు అందడం వల్లే బాబు ప్రభుత్వంపై బలంగా విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరితే ఏ సీటు ఇవ్వాలనే దానిపై వైసీపీ అధిష్టానం ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. వైస్‌ఆర్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న సీనియర్ నేత బొత్సతో పాటు విజయసాయి రెడ్డి సైతం ఆనంతో చర్చలు జరిపినట్లు పొలిటికల్‌ టాక్‌. ఈ లెక్కల్ని బట్టి చూస్తే ఆనం ఫ్యాన్ కిందకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories