అలిపిరిలో ఉద్రిక్తం, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు

Submitted by santosh on Fri, 05/11/2018 - 14:44
AMITHSHA IN TIRUMALA

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురయ్యింది. అలిపిరి దగ్గర నిరనసకు దిగిన టీడీపీ కార్యకర్తలు.. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు, వారిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయటికొచ్చిన అమిత్ షాకు హోదా సెగ తగిలింది.  అలిపిరి గరుడ సర్కిల్ దగ్గర టీడీపీ కార్యకర్తలు అమిత్ షా రాకను నిరసిస్తూ.. నల్ల జెండాలను ప్రదర్శించారు. అమిత్ షా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. 

అలిపిరిలో ఆందోళనకు దిగిన టీడీపీ కార్యకర్తలు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని బీజేపీ తుంగలో తొక్కిందన్నారు. మళ్లీ ఏ మొఖం పెట్టుకుని  అమిత్ షా తిరుమలకొచ్చారని టీడీపీ కార్యకర్తలు నిలదీశారు.  ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

అమిత్‌షా తిరుమల పర్యటన నేపథ్యంలో నిరసనకారులు ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనకు దిగారు. తిరుగు ప్రయాణంలో అమిత్‌షా కాన్వాయ్‌పై నిరసనకారులు రాళ్లదాడికి చేశారు. అమిత్ షాను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తల ప్రయత్నించారు. బీజేపీ నేతల వాహనాలపై దాడి
 చేయడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసున్నారు. పటిష్ట భద్రత మధ్య అమిత్ షా ఎయిర్ పోర్టు చేరుకున్నారు. 

English Title
AMITHSHA IN TIRUMALA

MORE FROM AUTHOR

RELATED ARTICLES